తెలంగాణలో రెయిన్ అలర్ట్..
- October 07, 2022
హైదరాబాద్: బంగాళాఖాతలంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. అటు తెెలంగాణలోని ఆరు జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ జిల్లాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు అలుగు పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంతో పాటు కర్ణాగూడ, పోచారం, ఉప్పరిగూడ గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. అటు ఏపీలోనూ ఉపరితల ద్రోణి ఆవర్తన ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏలూరు జిల్లా టీ. నరసాపురం మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. టీ. నర్సాపురం, బంధంచర్ల గ్రామాల్లో రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







