అమెరికాలో కిడ్నాప్ అయిన నలుగురు భారత సంతతి వ్యక్తులు హత్య ..
- October 07, 2022
అమెరికా: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ కు గురి అయ్యారు. వీరిని క్షేమంగా రక్షించటానికి అమెరికా పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. కిడ్నాప్ కు గురి అయినవారంత హత్య చేయబడ్డారు. ఎనిమిది నెలల చిన్నారి సహా కిడ్నాపర్ నలుగురిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఓ తోటలో ఎనిమిది నెలల చంటిపాపతో సహా నలుగురు విగత జీవులుగా కనిపించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గత సోమవారం (అక్టోబర్ 2202)కిడ్నాప్ కు గురైన ఈ నలుగురూ ఓ తోటలో విగత జీవులుగా కనిపించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా భారత సిక్కు కుటుంబానికి చెందిన వాళ్లు. మృతులను కాలిఫోర్నియాలోని మెర్సిడెస్ కౌంటీలో నివాసముంటున్న భారత సంతతికి చెందిన 36 ఏళ్ల జస్దీప్ సింగ్, అతని భార్య 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల పాప ఆరూహి దేహి,39 ఏళ్ల వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ లుగా గుర్తించారు.
జస్దీప్ కుటుంబం కొన్ని రోజుల కిందట ట్రక్కుల రవాణా వ్యాపారం ప్రారంభించింది. సోమవారం ఉదయం ఈ నలుగురూ తమ ఆఫీసుకు వెళ్లిన తర్వాత ఓ గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ నలుగురినీ ఓ ట్రక్కులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. కిడ్నాప్ అయిన వారిలో ఒకరి బ్యాంకు కార్డును మంగళవారం ఉదయం దుండగుడు స్థానిక ఏటీఎంలో ఉపయోగించినట్లు గుర్తించారు.
దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించగా అక్కడి సీసీ పుటేజీ ఆధారంగా 48 ఏళ్ల మాన్వేల్ సాల్గాడో అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనే ఈ నలుగురినీ హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ దారుణానికి గత కారణాలు తెలియాల్సి ఉంది. కాగా..ఆర్థిక లావాదేవీలే కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.కాగా..పోలీసుల కస్టడీలో ఉన్న సాల్గాడో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సాల్గాడో పేరు మోసిన నేరగాడు. 2005 నాటి ఆయుధాల దోపిడీ కేసులో ఇతను 11 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







