పార్కింగ్ సమస్యలకు స్మార్ట్ సొల్యూషన్
- April 19, 2016
ఖతార్ మొబిలిటీ ఇన్నోవేషన్స్ సెంటర్ (క్యూఎంఎఐసి), పార్కింగ్ సైట్స్ నుంచి తగినంత సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, స్మార్ట్ పార్కింగ్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ముందుగా దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్, సౌద్ వకిఫ్ మరియు పలు షాపింగ్ సెంటర్స్ వద్ద పార్కింగ్ సైట్స్ సమాచారాన్ని సేకరిస్తున్నామని క్యూఎంఐసి సీఈఓ డాక్టర్ అద్నాన్ అబు దయ్యా చెప్పారు. స్మార్ట్ పార్కింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, అప్లికేషన్స్‌నీ, సేవల్నీ అభివృద్ధి చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. ఏయే సమయాల్లో ఏయే పార్కింగ్ స్లాట్స్ ఫుల్ అవుతున్నాయి, ఎక్కడ ఖాళీగా ఉంటున్నాయనే సమాచారాన్ని సేకరించి, దాన్ని వినియోగదారులకు చేరవేసేలా స్మార్ట్ పార్కింగ్ విధానం ఉపయోగపడ్తుందని ఆయన చెప్పారు. పార్కింగ్ సమస్యల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకే స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని రూపొందిస్తామని చెప్పారాయన. వాతావరణ పరిస్థితుల ఆదారంగా ఇండోర్ పార్కింగ్ వైపే ఎక్కువగా వాహనదారులు మొగ్గు చూపుతారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







