ఆ రొయ్యల వినియోగంపై నిషేధం విధించిన ఖతార్
- October 08, 2022
దోహా: దిగుమతి రొయ్యల వినియోగంపై ఖతార్ నిషేధం విధించింది. దిగుమతి చేసుకున్న రొయ్యలలో కొంత పరిమాణంలో కలుషితమైన సూక్ష్మజీవులు ఉన్నట్లు తమ ఫుడ్ లేబొరేటరీల విశ్లేషణలో తేలిందని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకున్న రొయ్యలను మార్కెట్ నుంచి నిషేధించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లలో ఉన్న స్టాకును ఉపసంహరించుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అలాగే గత మూడు రోజుల్లో మార్కెట్ నుంచి భారత్ భారతీయ రొయ్యలను కొనుగోలు చేసినట్లయితే, దానిని వినియోగించవద్దని మంత్రిత్వ శాఖ వినియోగదారులకు పిలుపునిచ్చింది. ఒకవేళ ఇప్పటికే తిన్న సందర్భంలో గ్యాస్ట్రో-ఇంటెస్టినల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







