గృహ కార్మికుల కోసం కొత్త చట్టం
- October 08, 2022
యూఏఈ: యూఏఈలో పనిమనుషుల రిక్రూట్మెంట్, ఇతర హక్కులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.గృహ కార్మికుల పరిక్షణను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) ఫెడరల్ డిక్రీ లా నం. 9 ఆఫ్ 2022ను అక్టోబర్ 05న విడుదల చేసింది.ఇది గృహ కార్మిక చట్టంలోని అన్ని అంశాలను కవర్ చేస్తుంది. కార్మికులు, యజమానులు, రిక్రూట్మెంట్ ఏజెంట్లు అనుసరించాల్సిన నిబంధనలు, ఒకవేళ వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు, శిక్షలను ఇందులో కులంకషంగా వివరించడం జరిగింది.కొత్త నిబంధనలలో గృహ కార్మికులకు పని గంటలు, వారపు విరామాలు, సెలవులను కూడా పేర్కొనడం జరిగింది. చట్ట కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం గృహ కార్మికులకు వారానికి వేతనంతో కూడిన ఓ సెలవు దినం తప్పనిసరి.
ఇక చట్టంలోని ఆర్టికల్-27 గృహ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించించే వారికి విధించే జరిమానాలను వివరిస్తుంది.యూఏఈలో చట్టవిరుద్ధంగా గృహ కార్మికులను నియమించుకునే వ్యక్తులకు కనీసం 50వేల దిర్హాములు నుంచి 2లక్షల దిర్హాములు వరకు జరిమానా విధించబడుతుందని ఆర్టికల్-27లోని క్లాజ్ (3) పేర్కొంటోంది. అలాగే గృహ కార్మికుల కోసం జారీ చేసిన వర్క్ పర్మిట్ లను దుర్వినియోగం చేసిన, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కార్మికులను నియమించుకుంటే కూడా ఇదే పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.ఇలా పనిమనుషులకు యూఏఈ పూర్తి రక్షణాత్మక వ్యవస్థను తీసుకువస్తుంది. ఇప్పటికే యూఏఈ ప్రభుత్వం విదేశీయులకు వీసా విధానాలను పూర్తిగా సరళతరం చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలను చూస్తుంటే విదేశీ కార్మికులను ఆకర్షించడమే లక్ష్యంగా యూఏఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
తాజా వార్తలు
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…
- సౌదీ అరేబియా: ఘోర బస్సు ప్రమాదం.. 42 మంది మృతి..







