నిషేధిత ప్రదేశాల్లో వేట.. 16 మంది పౌరులను అరెస్టు చేసిన సౌదీ
- October 09, 2022
సౌదీ: అనుమతి పత్రం లేకుండా రక్షిత ప్రాంతంలోకి ప్రవేశించి నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు 16 మంది పౌరులను అరెస్టు చేసినట్లు ఎన్విరాన్‌మెంటల్ సెక్యూరిటీ కోసం నియమించిన ప్రత్యేక దళాలు వెల్లడించాయి. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రాయల్ రిజర్వ్, ఇమామ్ అబ్దుల్ అజీజ్ బిన్ మొహమ్మద్ రాయల్ రిజర్వ్ లలో వేటగాళ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ప్రత్యేక దళాలు తెలిపాయి. వారి వద్ద నుంచి 6 షాట్‌గన్‌లు, 11 ఎయిర్ రైఫిల్స్, 4,870 రౌండ్ల మందుగుండు సామగ్రి, అప్పటికే వేటాడిన 74 వేట పక్షులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్టుల్లోకి ప్రవేశించడం, నిషేధిత ప్రదేశాల్లో వేటాడినందుకు SR 5,000 జరిమానా.. వేటకు షాట్‌గన్‌లు, వలలు, ఉచ్చులను ఉపయోగించినందుకు మరో SR100,000 వరకు జరిమానా కింది విధించే అవకాశం ఉందని పర్యావరణ భద్రత కోసం ఏర్పాటైన ప్రత్యేక దళాల ప్రతినిధి కల్నల్ అబ్దుల్‌రహ్మాన్ అల్-ఒటైబీ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







