ఇంతకీ విజయ్ దేవరకొండ, రష్మికతో వెళ్లాడా.? లేదా.?
- October 13, 2022
విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మికకు సంబంధించిన న్యూస్ అంటే, నెట్టింట్లో అసలే ట్రెండింగ్ ఆయె.
అలాంటిది వెకేషన్ కోసం మాల్దీవులు వెళ్లారన్న ఈ ప్రచారాన్ని సోషల్ కోడి గొంతెత్తి కూసేసింది. ఎయిర్ పోర్టులో ఈ జంట కెమెరాకి చిక్కారంటూ, దాంతో జంటగా వెకేషన్‌కి ఈ లవ్ బర్డ్స్ ఎగిరిపోయాయంటూ రకరకాల కథనాలు వేడి వేడిగా వడ్డించేశాయ్ పలు టీవీ ఛానెళ్లు. అందులో నిజమెంతో తెలీదు కానీ, ప్రచారం మాత్రం గుమ్మెత్తిపోయింది.
వెకేషన్‌లో భాగంగా రష్మిక మండన్నా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక్క ఫోటోలోనూ విజయ్‌తో కలిసి కనిపించలేదు రష్మిక మండన్నా. అయినా కానీ ఆ ప్రచారం ఆగలేదు.
తాజాగా వెకేషన్ పూర్తి చేసుకుని ఈ జంట ఇండియాకి తిరిగొచ్చేసిందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఎయిర్ పోర్టు వరకూ కలిసే వచ్చిన వీడీ, రష్మిక మండన్నా, ఎయిర్ పోర్టు నుంచి సెపరేట్ సెపరేట్‌గా వచ్చారని అంటున్నారు.
అసలింతకీ రష్మికతో వీడీ వెళ్లాడా.? లేదా.? అన్న గాసిప్‌కి ఒక్క ప్రూఫ్ కూడా లేదింతవరకూ. కానీ, జరిగిన ప్రచారం మాత్రం అల్టిమేట్. ఒకవేళ జంటగా వెకేషన్ ఎంజాయ్ చేస్తే కనుక, ఈ గుట్టును భలే మెయింటైన్ చేశారులే మన ‘గీత గోవిందం’.!
తాజా వార్తలు
- ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఒమన్..!!
- గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్
- కువైట్ లో వేగంగా మారుతున్న వాతావరణం..!!
- బహ్రెయిన్ లో కేరళ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం..!!
- గాజా బార్డర్స్ తెరవండి..WFP పిలుపు..!!
- దుబాయ్ లో Emirates Loves India చే మెగా దీపావళి ఉత్సవ్
- దళారీలను నమ్మి మోసపోవద్దు: టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు