రేపు ఉత్తమ అధికారులకు ప్రధానమంత్రి పురస్కారాలు..

- April 19, 2016 , by Maagulf
రేపు ఉత్తమ అధికారులకు  ప్రధానమంత్రి పురస్కారాలు..

 స్వచ్ఛభారత్‌, జన్‌ధన్‌ యోజన వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వోద్యోగులకు గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ప్రజా పరిపాలన విభాగంలో రాణించిన వారికి, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో సృజనాత్మకత జోడించి, అద్భుత ఫలితాలు రాబట్టిన కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవార్డులు అందజేస్తారు. పౌర సేవల దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రారంభంకానున్న కార్యక్రమానికి రైల్వేమంత్రి సురేష్‌ప్రభు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. సిబ్బంది, ప్రజాఫిర్యాదులశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ సభకు అధ్యక్షత వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com