OMR 22తో ఇండియాకు.. సలామ్ ఎయిర్ బంపరాఫర్

- October 13, 2022 , by Maagulf
OMR 22తో ఇండియాకు.. సలామ్ ఎయిర్ బంపరాఫర్

ఒమన్: బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులను ఆకర్షించేందుకు ఛార్జీలను తగ్గించడం సర్వసాధారణం. ఒమన్ బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ కూడా అదే దారిలో ప్రయాణిస్తోంది. టాక్సీ ఛార్జీలతో సమానమైన రేట్లతో విమాన ప్రయాణం అంటూ కొత్త ఫెయిర్ రేట్లను ప్రకటించింది. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ముత్రాహకు టాక్సీ ఛార్జీలతో సరిపోయే ధరలను అందిస్తోన్నట్లు తెలిపింది. కేవలం OMR 22 కంటే తక్కువ ఛార్జీలతో సలామ్ ఎయిర్ రెండు గమ్యస్థానాలకు (ఇండియా, ఐరోపా) ప్రమోషనల్ ఛార్జీలను ప్రకటించింది. ప్రముఖ పర్యాటక యూరోపియన్ గమ్యస్థానం, చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్‌కు.. దక్షిణ భారత నగరమైన త్రివేండ్రానికి కేవలం OMR 22 కంటే తక్కువ ధరకు ప్రయాణించవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ అక్టోబర్ 21-28 వరకు చెల్లుబాటు అవుతుందని సలామ్ ఎయిర్ చేసిన ట్వీట్ లో పేర్కొంది. సలామ్ ఎయిర్ ఒమన్‌లో ఉన్న మొదటి తక్కువ ధర ఎయిర్ క్యారియర్. దీన్ని 2016లో స్థాపించబడింది. తక్కువ-ధర విమానాలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలు, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గమ్యస్థానాలకు తన సర్వీసులను అందిస్తోంది. సుల్తానేట్‌లో ఎయిర్‌బస్ A320neo, A321neo విమానాలను ప్రవేశపెట్టిన మొదటి ఆపరేటర్ కూడా ఇదే. ప్రస్తుతం సలామ్ ఎయిర్ ఫ్లీట్‌లో ఆరు A320neo, రెండు A321 ఉన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com