మరో వందే భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోడీ...
- October 13, 2022
షిమ్లా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం కాగా..గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని అంబ్ అందౌరా స్టేషన్ వరకు నడిచే నాల్గో వందే భారత్ రైళ్లును మోడీ ప్రారంభించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే ఈ రైలును.. ఉనా జిల్లాలో ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.
ఢిల్లీ-ఉనా మధ్య అందుబాటులోకి వచ్చే ఈ వందే భారత్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా వాసులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ‘‘ఢిల్లీ-ఉనా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా ప్రజలకు ఎంతో ప్రయోజనం.. ఢిల్లీ లేదా ఇతర నగరాలకు వెళ్లే హరియాణా వాసులకు ఈ రైలు వల్ల ఎంతో మేలు జరుగుతుంది’’ అని హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అన్నారు. ఈ రైలు ఉదయం 5.50 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరి… ఉదయం 11.05 గంటలకు అంబ్ అందౌరా స్టేషన్ కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి 6.25 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకోనుంది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటుంది.
మరోవైపు చెన్నై- మైసూరు మధ్య ఐదవ వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీ గత నెలలో మూడో వందే భారత్ రైలును ప్రారంభించారు. గాంధీ నగర్-ముంబై మార్గంలో ఈ రైలు నడుస్తోంది. అయితే ఇది ప్రమాదానికి గురికావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే దీనికి రిపేర్ చేసి ట్రాక్ మీదకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







