బహ్రెయిన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన షూరా కౌన్సిల్ సెక్రటరీ జనరల్
- October 14, 2022
మనామా: అరేబియా గల్ఫ్‌లో అటువంటి పదవిని నిర్వహించిన మొదటి మహిళగా తనను నియమిస్తూ డిక్రీ జారీ చేసినందుకు షురా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కరీమా మహ్మద్ అల్ అబ్బాస్సీ తన మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపారు. HM కింగ్ హయాంలో బహ్రెయిన్ మహిళల ప్రధాన్యత పెరిగిందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య, శాసనపరమైన విజయాలను సాధించడానికి రాయల్ ట్రస్ట్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. అల్ అబ్బాస్సీ హెచ్‌ఎం రాజు దార్శనికతలను, ఆకాంక్షలను సాధించడంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మహిళా సాధికారత, అభ్యున్నతిలో కీలక పాత్ర పొషించిన మాజీ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ (SCW) ప్రెసిడెంట్ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫా( HM రాజు భార్య)కి నివాళులర్పించారు. అలాగే షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ జనరల్ సెక్రటేరియట్‌కు అందించిన మద్దతును కూడా ఆమె మెచ్చుకున్నారు. మానవ వనరులను ప్రోత్సహించడానికి అతను కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







