అవును.! ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నా.! పబ్లిగ్గా చెప్పిన శృతి హాసన్.!
- October 14, 2022
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల తనయగా సినిమాల్లోకి అడుగుపెట్టింది అందాల భామ శృతి హాసన్. తెలుగుతో పాటూ, తమిళ, హిందీ తదితర భాషల్లోనూ సత్తా చాటింది హీరోయిన్గా శృతి హాసన్.
అయితే, తాను హీరోయిన్ అవ్వాలనుకోవడానికి ముందే, తన బాడీలోని ఓ ముఖ్యమైన భాగానికి సర్జరీ చేయించుకుందట శృతిహాసన్. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ వెల్లడించింది.
సహజంగానే హీరోయిన్లు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటూ వుంటారు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి దగ్గర నుంచీ ఈ పద్ధతి చాలా సహజ సిద్ధంగానే జరుగుతూ వస్తోంది.
కొందరు ఈ విషయాన్ని గుట్టుగా వుంచేస్తారు. అయితే, శృతి హాసన్ మాత్రం పబ్లిగ్గా చెప్పేసింది. ఇంతకీ ఏ పార్టుకు శృతి హాసన్ సర్జరీ చేయించుకుంది చెప్మా.! అంటారా. ఆగండాగండి. తొందరపడకండి. మొదట్లో శృతి హాసన్ ముక్కు కాస్త వంకరగా వుండేదట. అద్దంలో చూసుకుంటే అదేమంత బాగా అనిపించేది కాదట శృతి హాసన్‌కి. దాంతో, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకుందట.
స్టార్ కిడ్ కదా. వెంటనే చేయించేసుకుంది. ఎంత ఖర్చయినా ఫర్వాలేదనుకుంది. అయితే, ఈ సర్జరీ కోసం చాలానే ఖర్చయ్యిందని చెబుతోంది శృతిహాసన్. ఇలాంటి సర్జరీలు చేయించుకోవడం ఏమంత తప్పుడు పని కాదంటూ కుండ బద్దలు కొట్టేస్తోంది కూడా.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







