ప్రయోగాలు చేయాలంటే, ప్రేక్షకులే మారాలంటోన్న ‘గాడ్ ఫాదర్’.!
- October 14, 2022
తెలుగు సినిమా ఫార్ములా అంటే, మూడు పైట్లూ, ఐదు పాటలు ఖచ్చితంగా వుండాల్సిందే. ఈ ఫార్ములాని పెడ చెవిని పెట్టి ప్రయోగాలు చేద్దామంటే, ఫ్లాప్ ముసుగు తొడిగేసి, పక్కన కూర్చోమంటారు ప్రేక్షకులు.
అందుకే మన తెలుగు మేకర్లు పెద్దగా రిస్క్‌లు చేయరు. ఎవరో ఒకరు అప్పుడప్పుడూ రిస్క్ చేసినా, బొక్క బోర్లా పడి అడ్రస్ గల్లంతు చేసుకుంటుంటారు. ఇంతకీ ఈ విషయం ఇప్పుడెందుకు చర్చకొచ్చిందంటే, లేటెస్టుగా రిలీజైన ‘గాడ్ ఫాదర్’ మేనియా కొనసాగుతోంది ప్రస్తుతం.
తెలుగు, హిందీ భాషల్లో రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమాని ఈ రోజు అనగా అక్టోబర్ 14 నుంచి తమిళంలోనూ రిలీజ్ చేశారు. సినిమా రిలీజై వారం గడుస్తున్నా, ప్రమోషన్లు ఆపడం లేదు చిరంజీవి.
ప్రమోషన్లలో భాగంగా సినిమా గురించే కాదు, రాజకీయ పరిణామాల గురించీ, ఇతరత్రా జనరల్ ఇష్యూస్ గురించి కూడా తనదైన శైలిలో స్పందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఆ క్రమంలోనే తెలుగు సినిమా ఫార్ములా విషయంలో ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారాలని ఆయన సూచించారు. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలని వుంది. కానీ, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా.? అన్న అనుమానం గట్టిగా వుందని ప్రేక్షకుల ఆలోచన మార్చేందుకు ‘గాడ్ ఫాదర్’ మూవీ ఓ నాంది, ప్రస్థావన కావాలని ఆయన కోరుకున్నారు. అప్పుడే, మంచి కథలు, కంటెంట్ వున్న సినిమాలూ తెరకెక్కుతాయని మెగాస్టార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







