భారత్లో తయారైన దగ్గు సిరప్లపై హెచ్చరికలు జారీ చేసిన అబుధాబి
- October 15, 2022
అబుధాబి: ఇటీవల గాంబియాలో చిన్నారుల మరణానికి కారణమైన నాలుగు దగ్గు, జలుబు మందులపై(ప్రోమెథాజైన్ నోటి ద్రావణం BP, కోఫెక్స్మలిన్ బేబీ దగ్గు సిరప్, మాకోఫ్ బేబీ, మాగ్రిప్ ఎన్ కోల్డ్) ఎమిరేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ (DoH) హెచ్చరికలు జారీ చేసింది. భారత్ లో తయారైన ఈ దగ్గు, జలుబు మందులను అబుధాబిలో ఎక్కడా విక్రయించడం లేదని డీఓహెచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ మందులను కొని వినియోగించే వారు ఏమైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరింది. భారత్కు చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు, జలుబు ఔషధాల కారణంగా ఇటీవల ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ దగ్గు మందులు, జలుబు మందుల వినియోగంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మందుల ఉత్పత్తిపై నిషేధం విధించిన భారత్.. ఆ కంపెనీ ఉత్పత్తులపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







