ఏపీకి రాజధాని ఒకటేనని తేల్చి చెప్పిన రాహుల్ గాంధీ
- October 19, 2022
అమరావతి: ఏపీ రాజధాని విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన స్పందనను తెలియజేసారు. ఏపీకి రాజధాని ఒకటేనని, అది అమరావతే అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రాజధాని అంశం వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన రాజధాని అమరావతి కాదని , మూడు రాజధానుల అంశాన్ని వైస్సార్సీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఓ పక్క అమరావతి రైతులు అమరావతి రాజధానికి మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే..వైస్సార్సీపీ మాత్రం మూడు రాజధానులు మొగ్గు చూపిస్తుంది.
ఇలాంటి తరుణంలో .‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా ఏపీలో పాదయాత్ర చేస్తున్న రాహుల్..ఏపీ రాజధాని విషయంలో తన స్పందనను తెలిపారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన మంచిది కాదన్నారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటే బాగుంటుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తనను కలిశారని , వాళ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. పోలవరంతో సహా విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రందే అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎవరితో పొత్తులు అనేది అధ్యక్షునిదే తుది నిర్ణయమని రాహుల్ గాంధీ చెప్పారు. తాను ఎలాంటి పాత్ర పోషించాలనేది పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారన్నారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజన గురించి కాకుండా భవిష్యత్ గురించి ఆలోచించాలని రాహుల్ సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్‌లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరని రాహుల్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలలో డిక్టేటర్ షిఫ్ ఉంటుంది కాబట్టి ఇతర నేతలు ఎవరూ మాట్లాడలేరన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







