ఎల్‌కేజీ బాలికపై అత్యాచారం కేసు..డ్రైవర్, ప్రిన్సిపాల్ అరెస్ట్
- October 19, 2022
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో జరిగిన దారుణంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే నిందితుడు రజనీకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. ఎల్ కేజీ బాలిక పై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడిని కాపాడేందుకు ప్రిన్సిపాల్ మాధవి ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాలుగేన్నరేళ్ల చిన్నారి పై లైంగిక దాడి ఘటన పై స్కూల్ ప్రిన్సిపాల్ మాధవికి సమాచారం తెలుపగా, ఆమె నిర్లక్ష్యంగా తల్లిదండ్రులకు సమాధానం ఇచ్చారు. ఈ వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ మాధవి పైనా కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని కోరుతూ భోరున విలపించారు.
నిందితుడు రజనీకుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. నేరం రుజువైతే రజనీకుమార్ కు 20ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు పోలీసులు.
ప్రిన్సిపాల్ స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. స్కూల్ లో ల్యాబ్ ల నిర్వహణ కూడా చూస్తున్న ఆ నీచుడు.. సోమవారం మరింత బరి తెగించాడు. ప్రిన్సిపాల్ మాధవి రూమ్ ఎదురుగా ఉన్న ల్యాబ్ లో బాలికపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించాడు. నీరసంగా ఉన్న బాలికను తల్లి పదే పదే ప్రశ్నించడంతో అత్యాచారం గురించి బాలిక తల్లితో చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు బాలికను స్కూల్ కి తీసుకెళ్లగా.. నిందితుడిని గుర్తించింది. అనంతరం బాలిక తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనంతరం ఇంటికి పంపారు.
రెండు నెలలుగా బాలిక ప్రవర్తన డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా ఉందని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. ఈ దారుణంలో స్కూల్ ప్రిన్సిపాల్ పాత్రపైనా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా నిందితుడి లైంగిక వేధింపుల గురించి ఇతర బాలికల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారని పోలీసులతో చెప్పారు. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
గతంలో సఫిల్ గూడ బ్రాంచ్ లో రజనీకుమార్ పని చేశాడు.అక్కడ కూడా నిందితుడు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో ఒక్కసారిగా స్కూల్ లోని ఇతర పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో చిన్నారుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు.. పిల్లల భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నాయని మండిపడుతున్నారు. బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాలలో చిన్నారిపై అత్యాచారం క్షమించరాని నేరం అంటున్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంతో పాటు బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







