బహ్రెయిన్‌లో బిల్లుల పేమెంట్లకు కొత్త ఆప్షన్స్

- October 19, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో బిల్లుల పేమెంట్లకు కొత్త ఆప్షన్స్

బహ్రెయిన్ : విద్యుత్-వాటర్ వినియోగదారులు తమ బిల్లులను సులభంగా వీక్షించడానికి, చెల్లించడానికి బెనిఫిట్ పే, EWA అప్లికేషన్ లకు ఉపయోగించేందుకు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) అనుమతించింది. వీటితోపాటు సీఫ్, రామ్లీ, అల్ ఆలీ, బహ్రెయిన్ మాల్స్‌లో అందుబాటులో ఉన్న టామ్ మెషీన్ల ద్వారా వినియోగదారులు నగదు రూపంలో తమ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని అథారిటీ తెలిపింది. ఫిక్స్‌డ్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులు వాయిదాల రూపంలో చెల్లించే సౌకర్యాన్ని ఆగస్టులో ప్రారంభించినట్లు, ఆసక్తి ఉన్న వినియోగదారులు ఆ సర్వీసును ఉపయోగించుకోవాలని అథారటీ సూచించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com