నిబంధనలకు లోబడే జీరో% ఆల్కహాల్ డ్రింక్స్
- April 20, 2016
కొన్ని మాల్ట్ డ్రింక్స్‌లో ఆల్కహాల్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణల్ని దుబాయ్ మునిసిపాలిటీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఖండించింది. జీరో పర్సంట్ ఆల్కహాల్ మాల్ట్ డ్రింక్స్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్‌లో ఆల్కహాల్ కంటెంట్ ఉన్నా అది నామమాత్రమేననీ, నిబంధనలకు లోబడి ఉన్నాయని అధికారులు ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఓ ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. లోకల్ మార్కెట్‌లో దొరికే అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్‌పైనా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే ఆహార పదార్థాల్ని మార్కెట్‌లోకి రానివ్వమని వారు చెప్పారు. పుకార్లను ఎవరూ నమ్మరాదనీ, ఎలాంటి సమాచారం కావాలన్నా అధికారగణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







