నవంబర్ 25న దుబాయ్‌లో ఇళయరాజా ‘లైవ్ ఇన్ కాన్సర్ట్’

- October 20, 2022 , by Maagulf
నవంబర్ 25న దుబాయ్‌లో ఇళయరాజా ‘లైవ్ ఇన్ కాన్సర్ట్’

దుబాయ్‌: ఇండియన్ లెజెండ్ మాస్ట్రో ఇళయరాజా దుబాయ్‌లోని సిటీ వాక్‌లోని కోకా-కోలా అరేనాలో నవంబర్ 25న ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు మనో, కార్తీక్, ఉషా ఉదుప్, శ్వేతా మోహన్, యుగేంద్రన్, SPB చరణ్, విభావరి జోషి, ప్రియా హేమేష్, అనితా కార్తికేయ తదితర గాయకులు ఇళయరాజాతో కలిసి లైవ్ ఇన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. 65 మంది సంగీతకారులు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ పాటలను ఆలపించనున్నారు. బుక్‌మీ షో (http://ae.bookmyshow.com)లో టిక్కెట్‌లు విక్రయించబడతాయని, 2022 అక్టోబర్ 24 నుండి నవంబర్ 6 వరకు తగ్గింపు ధరలతో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. పద్మవిభూషణ్ ఇళయరాజాను ఇటీవల యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించిన విషయం తెలిసిందే. ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈవెంట్‌ను హాల్స్ స్టూడియోస్ (HALS STUDIOS INC) నిర్వహిస్తోంది. ప్రముఖ సినీ నిర్మాతలు అభిషేక్ ఫిలిమ్స్, రమేష్ పి పిళ్లై, ఇసై రాజాంగం దుబాయ్‌లో ఈవెంట్ పార్టనర్‌లుగా వ్యవహారించనున్నారు. మా గల్ఫ్, క్లబ్ ఎఫ్ఎమ్, తమిళ్ ఎఫ్ఎమ్, రేడియో కుషి, మాతృభూమి న్యూస్, ధినతండి, ఖలీజ్ టైమ్స్ లు మీడియా పార్టనర్స్ గా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com