ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ అందుకున్న ఎల్–టీ హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లు
- October 20, 2022
హైదరాబాద్: ప్రపంచంలో అత్యుత్తమ హరిత నగరం హైదరాబాద్‌లో హరిత, స్వచ్ఛ నగర ప్రజా రవాణా వ్యవస్థలలో అగ్రగామి అయిన ఎల్–టీ హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు ఐజీబీసీ గ్రీన్ ఎంఆర్టీఎస్ సర్టిఫికేషన్‌ను అత్యధిక ప్లాటినమ్ రేటింగ్‌తో పొందింది. ఈ సర్టిఫికేషన్‌ను ఎలివేటెడ్ స్టేషన్స్ విభాగంలో మూడు అదనపు మెట్రో స్టేషన్లకు పొందింది.ఈ స్టేషన్లలో దుర్గంచెరువు (కారిడార్ 3, బ్లూ లైన్–నాగోల్ టు రాయ్‌దుర్గ్), పంజాగుట్ట మరియు ఎల్బీనగర్ (కారిడార్1, రెడ్‌లైన్–ఎల్బీనగర్ టు మియాపూర్) ఉన్నాయి.మూడు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022లో భాగంగా నేడు ఈ సర్టిఫికేషన్ అందజేశారు. ఎల్ – టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ–సీఈఓ కెవీబీ రెడ్డి ఈ ఐజీబీసీ ప్లాటినమ్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు.దీనితో హైదరాబాద్ మెట్రో రైల్‌కు చెందిన 23 మెట్రో స్టేషన్లు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ సర్టిఫైడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందాయి.
ఈ గుర్తింపు గురించి ఎల్–టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ–సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా మూడు అదనపు మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినమ్ రేటింగ్ అందుకోవడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. మెట్రో స్టేషన్లను ఆడిటింగ్ చేయడంతో పాటుగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో మా ప్రయత్నాలను గుర్తించడం సంతోషంగా ఉంది. ఇటీవలనే ప్రపంచ హరిత నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం పట్ల మా నిబద్ధతను ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







