విమానాశ్రయం నుండి స్నేహితుడిని పికప్ చేసిన ప్రవాసి బహిష్కరణ!

- October 22, 2022 , by Maagulf
విమానాశ్రయం నుండి స్నేహితుడిని పికప్ చేసిన ప్రవాసి బహిష్కరణ!

కువైట్: ఎయిర్ పోర్ట్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తన స్నేహితుడిని పికస్ చేసిన ప్రవాస ఈజిప్టు ప్రవాసిని రిఫరల్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. సదరు ప్రవాసి తన స్నేహితుడిని ఎయిర్ పోర్ట్ నుంచి పికప్ చేసుకొని రోడ్డుపై ప్రమాదకరంగా ట్రావెల్ బ్యాగులతో డ్రైవింగ్ చేశాడని డైరెక్టరేట్ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సదరు వీడియోపై విచారణకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఆదేశించిది. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన వ్యక్తితోపాటు అతడి బైకును సీజ్ చేసినట్లు డైరెక్టరేట్ ప్రకటించింది. విచారణ సమయంలో నిందితుడు తన స్నేహితుడిని విమానాశ్రయం నుండి ఫికప్ చేయడానికి మాత్రమే వచ్చానని, ట్రావెల్ బ్యాగులను తన స్నేహితుడే స్వచ్ఛందంగా పట్టుకునేందుకు ముందుకొచ్చాడని డైరెక్టరేట్ తన నివేదికలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com