సౌత్ సినిమాల గురించి సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు..
- October 22, 2022
బెంగళూరు: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కన్నడ చిత్రసీమ నుంచి వస్తున్న మరో పాన్ ఇండియన్ యాక్షన్ మూవీ “KD ది డెవిల్”. ఈ చిత్రంలో సంజయ్ ఒక్క కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను గురువారం బెంగళూరులో విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు. సంజయ్ మాట్లాడుతూ..”నేను KGFలో పనిచేశాను, ఇప్పుడు దర్శకుడు ప్రేమ్‌తో KDలో పని చేస్తున్నాను. భవిషత్తులో కూడా మరిన్ని సౌత్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా.సౌత్‌లో చేసే సినిమాల్లో నాకు చాలా ప్యాషన్, లవ్, ఎనర్జీ, హీరోయిజం కనిపిస్తాయి.
బాలీవుడ్ ఈ విషయాలని మర్చిపోయింది, మళ్ళీ తిరిగి నేర్చుకోవాలి. అంతేకాదు హిందీ సినిమా మూలలను కూడా మర్చిపోకూడదంటూ” వ్యాఖ్యానించాడు. ఇక “KD ది డెవిల్” సినిమా 1970లో నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాబోతుంది. విడుదలైన టీజర్ మూవీపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమాలో కన్నడ హీరో ‘ధృవ సర్జా’ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







