హైవేపై ట్రాఫిక్ ఉల్లంఘన.. 2 గంటల్లో అరెస్టు
- October 23, 2022
యూఏఈ: రద్దీగా ఉండే హైవేకి వ్యతిరేక దిశలో వేగంగా దూసుకెళ్లి మరో అంతర్గత రహదారిపై విన్యాసాలు చేసిన 26 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడిని అజ్మాన్ పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్ విభాగం అరెస్టు చేసింది. అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం నిఘా కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో అధికారులు రెండు గంటల్లోనే అరెస్టు చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ట్రాఫిక్‌కు వ్యతిరేకంగా వాహనదారుడు డ్రైవింగ్ చేస్తున్న వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అజ్మాన్ పోలీస్‌లోని ట్రాఫిక్, పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అబ్దుల్లా అల్ ఫలాసి మాట్లాడుతూ.. ఆపరేషన్ రూమ్‌లోని కంట్రోల్ సిస్టమ్స్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌ను గుర్తించి అతనిని ట్రాక్ చేశాయని తెలిపారు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేసినట్లు లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అల్ ఫలాసీ పేర్కొన్నారు. అతని ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు లేదా భద్రతకు హాని కలిగించే విధంగా వాహనం నడిపినందుకు అతనికి 2000 దిర్హాంల జరిమానా, ట్రాఫిక్‌కు వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపినందుకు అతనికి Dh600 జరిమానా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు Dh500 ఫైన్ విధించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







