తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యం లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
- April 20, 2016
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా: నారా చంద్ర బాబు గారి జన్మ దిన వేడుకలు కువైట్ లో తెలుగు దేశం ఘనంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం కువైట్ పార్తీ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆధ్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా మరియు నందమూరి అభిమానులు, పరిటాల అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
మోహన్ బాబు గారి స్వాగతోపన్యాసముతో సభ ప్రారంభమయి, అధ్యక్ష్యులు సుధాకర రావు గారి సందేశముతో ముగిసినది. చంద్ర బాబు గారి స్పూర్తితో తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను అధ్యక్షులు అందరికి తెలియ చేసారు.
సభలో పాల్గొన్న వారందరూ అందరూ కలసి కేక్ కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. నారా లొకేష్ సేవా సమితి కువైట్ అధ్యక్షులు పట్టాభి నాయుడు గారు,గల్ఫ్ వైడ్ నందమూరి ఫాన్స్ నాయకులు పోలారపు బాబు నాయుడు గారు, NTR సేవాదళ్ కువైట్ అధ్యక్షులు కస్తూరి కోటేశ్వర నాయుడు గారు, పరిటాల యువ సేన నాయకులు రెడ్డయ్య గారు, తెలుగు దేశం కువైట్ మైనారిటీ విభాగం నాయకులు షేక్ బాషా గారు, ప్రముఖ తెలుగుదేశం నాయకులు నాగేంద్ర బాబు గారు, పిడికిటి శ్రీనివాస చౌదరి గారు, ఖైతాన్ బాబు నాయుడు గారు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







