తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యం లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

- April 20, 2016 , by Maagulf

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా: నారా చంద్ర బాబు గారి జన్మ దిన వేడుకలు కువైట్ లో తెలుగు దేశం ఘనంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం కువైట్ పార్తీ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆధ్వర్యం లో  జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా మరియు నందమూరి అభిమానులు, పరిటాల అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మోహన్ బాబు గారి స్వాగతోపన్యాసముతో సభ ప్రారంభమయి, అధ్యక్ష్యులు సుధాకర రావు గారి సందేశముతో ముగిసినది. చంద్ర బాబు  గారి స్పూర్తితో తెలుగుదేశం కువైట్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను అధ్యక్షులు అందరికి తెలియ చేసారు.

సభలో పాల్గొన్న వారందరూ  అందరూ కలసి కేక్ కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. నారా లొకేష్ సేవా సమితి కువైట్ అధ్యక్షులు పట్టాభి నాయుడు గారు,గల్ఫ్ వైడ్ నందమూరి ఫాన్స్ నాయకులు పోలారపు బాబు నాయుడు గారు, NTR  సేవాదళ్ కువైట్ అధ్యక్షులు కస్తూరి కోటేశ్వర నాయుడు గారు, పరిటాల యువ సేన  నాయకులు రెడ్డయ్య గారు,  తెలుగు దేశం కువైట్ మైనారిటీ విభాగం నాయకులు షేక్ బాషా గారు,  ప్రముఖ తెలుగుదేశం  నాయకులు నాగేంద్ర బాబు గారు, పిడికిటి శ్రీనివాస చౌదరి గారు, ఖైతాన్ బాబు నాయుడు గారు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com