దుబాయ్ పామ్ మోనోరైల్‌లో నోల్ కార్డ్‌ అనుమతి

- October 26, 2022 , by Maagulf
దుబాయ్ పామ్ మోనోరైల్‌లో నోల్ కార్డ్‌ అనుమతి

దుబాయ్: దుబాయ్‌లోని నివాసితులు, సందర్శకులు ఇప్పుడు ది పామ్ మోనోరైల్‌లో ప్రయాణించేందుకు ఆర్టీఏ నోల్ కార్డ్‌ని ఉపయోగించేందుకు అనుమతించారు. ప్రజా రవాణా నెట్‌వర్క్‌లను ఏకీకృతం చేయడానికి ఇది మద్దతుగా నిలుస్తుందని కార్పొరేట్ టెక్నాలజీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టార్ సీఈఓ మహమ్మద్ యూసఫ్ అల్ ముధర్రెబ్ అన్నారు. టాప్ గ్లోబల్ స్టాండర్డ్స్, ప్రాక్టీస్‌లకు అనుగుణంగా ప్రైవేట్ సెక్టార్‌తో సహకారాన్ని విస్తృతం చేయడానికి ఆర్టీఏ వ్యూహాలో భాగంగా నోల్ కార్డ్‌ అనుమతి ఇచ్చినట్లు అల్ ముదర్రెబ్ వెల్లడించారు.
నోల్ కార్డ్ అంటే ఏమిటి?
నోల్ అనేది వివిధ ఆర్టీఏ ట్రాన్సిట్ సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే స్మార్ట్ కార్డ్. ఇది మెట్రో, బస్సులు, ట్రామ్, సముద్ర రవాణా మార్గాలైన వాటర్ టాక్సీ, వాటర్ బస్సు అలాగే పబ్లిక్ పార్కింగ్ స్లాట్‌ల ఛార్జీలను చెల్లించడానికి ఉపయోగించబడుతుంది. ప్రయాణంతోపాటు దుబాయ్ మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్ పార్కులు, ఎతిహాద్ మ్యూజియం కోసం ప్రవేశ రుసుమును చెల్లించడానికి కూడా కార్డ్‌ని ఉపయోగించవచ్చు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com