క్రికెటర్ ధోనీ నిర్మాణంలో తమిళ సినిమా.!
- October 26, 2022
మాజీ క్రికెటర్ ధోనీ, ఇప్పుడు సినిమాల్లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే యాక్టర్‌గా కాదండోయ్. ప్రొడ్యూసర్‌గా. ధోనీ తన భార్య సాక్షితో కలిసి నిర్మాతగా మారనున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్‌ని స్థాపించారు.
ఈ బ్యానర్‌పై అభిరుచి గల సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఈ నిర్మాణ సంస్థంలో తొలి సినిమాగా ఓ చిన్న సినిమాని రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ టీమ్.
అందులో భాగంగానే ఓ తమిళ సినిమాని ఎంచుకున్నాడు ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్‌గా ధోనీ ఈ మధ్య తమిళ తంబీలకు బాగా దగ్గరైపోయాడు. అందుకే, తన బ్యానర్లో తొలి సినిమాని తమిళంలోనూ రూపొందించాలనుకుంటున్నాడు.
తమిళ హీరో హరీష్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా ఓ ఫ్యామిలీ స్టోరీని ఈ బ్యానర్లో తొలి సినిమాగా రూపొందించబోతున్నాడు ధోనీ. ఈ నిర్మాణ సంస్థకి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నింటినీ ధోనీ భార్య సాక్షి పర్యవేక్షించనుందట. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది.
కాగా, మొదట చిన్న సినిమాతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించాలనుకుంటున్నారట ధోనీ అండ్ హిజ్ ప్రొడక్షన్ టీమ్.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







