బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 2’కి మంత్రి రోజా నిజమేనా.?

- October 26, 2022 , by Maagulf
బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 2’కి మంత్రి రోజా నిజమేనా.?

నందమూరి నటసింహం బాలయ్యలోని మరో కోణాన్ని వెలికి తీసిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఇటీవలే రెండో సీజన్ స్టార్ట్ చేసింది ఆహా ఓటీటీ. 
మొదటి ఎపిసోడ్‌కి గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి షోకి ఎక్కడ లేని హైప్ క్రియేట్ చేసింది ‘అన్‌స్టాపబుల్ 2’ టీమ్. ఇక రెండో ఎపిసోడ్‌కి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో ఫుల్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు బాలయ్య.
ఇక ముచ్చటగా మూడో సీజన్ కోసం సీనియన్ నటి రమ్యకృస్ణ, అందాల భామ రాశీ ఖన్నాని పిలిపించి, గ్లామర్ అద్దబోతున్నారు బాలయ్య తన టాక్ షోకి. ఇక తదుపరి సీజన్ గెస్ట్ విషయంలో అందిరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది ‘అన్‌స్టాపబుల్ 2’ టీమ్.
ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ మంత్రి రోజాని ఈ టాక్ షోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆల్రెడీ రోజాతో బాలయ్య సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. రోజా కూడా ఈ టాక్ షోకి రావడానికి సుముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. 
గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసిన బాలయ్య, రోజా.. ప్రస్తుతం రాజకీయాల పరంగా ఉప్పూ, నిప్పూ మాదిరి ఒకరి మీద ఒకరు పొలిటికల్ సెటైర్లు వేసుకునే సంగతి తెలిసిందే. అలాంటిది, ఈ ఇద్దరూ ఒకే వేదికపై వుంటే, ఎలా వుంటుంది. ఆ మజానే వేరే వుంటది కదా. అందుకే ఈ టాక్ షోపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com