నిర్మాణ స్థలాల్లో నిబంధనలు పాటించని 32 మందిపై చర్యలు
- October 27, 2022
బహ్రెయిన్: సదరన్ గవర్నరేట్‌లోని నిర్మాణ స్థలాల్లో లేబర్ మార్కెట్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు 32 మంది వ్యక్తులపై లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానెల్‌ల ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు నిర్మాణ సైట్లను తనిఖీ చేసినట్లు అథారిటీ పేర్కొంది. తనిఖీల సమయంలో నిర్ణీత విధానాలకు అనుగుణంగా లేని వాటిపై చర్యలు చేపట్టినట్లు వివరించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్‌లో జాతీయత, పాస్‌పోర్ట్‌లు, నివాస వ్యవహారాల సహకారంతో సంయుక్త తనిఖీ విభాగాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టినట్లు అథారిటీ వెల్లడించింది. యజమానులు, కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ.. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను అరికట్టేందుకు వాణిజ్య సంస్థలు, పని ప్రదేశాలు, లేబర్ సైట్ల దగ్గర నిరంతరం తనిఖీ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









