65 డ్రగ్ ఏజెన్సీలకు SR1.6 మిలియన్ల జరిమానా
- October 29, 2022
సౌదీ: సెప్టెంబర్‌లో డ్రగ్స్(మందులు) నిల్వలపై నివేదికలు సమర్పించని 65 ఫార్మాస్యూటికల్ ఏజెన్సీలకు జరిమానాలు విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)తెలిపింది. ఆయా ఏజెన్సీలు రిజిస్టర్డ్ ఉత్పత్తుల సరఫరాలో కొరత లేదా అంతరాయాన్ని నివేదించడంలో.. అలాగే వాటిలో కొన్ని రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను అందించడంలో విఫలమయ్యాయని అథారిటీ పేర్కొంది. ఆమోదించబడిన ఇ-మానిటరింగ్ సిస్టమ్ ఆర్ఎస్డీలో(RSD) 24 ఫ్యాక్టరీలు/ డ్రగ్ ఏజెంట్లు డ్రగ్స్ షార్టేజీపై వివరాలు తెలుపలేదు.. 8 ఔషధ సంస్థలు 12 ఉత్పత్తులను సరఫరా చేయడంలో విఫలమయ్యాయని, 15 సంస్థలు ఆశించిన వాటిని నివేదించడంలో విఫలమైనందుకు వాటిపై చర్యలు తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫార్మాస్యూటికల్, హెర్బల్ ఫెసిలిటీస్ అండ్ ప్రిపరేషన్స్ లా.. దాని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్‌లో నిర్దేశించిన జరిమానాల ప్రకారం ఉల్లంఘించిన సంస్థలపై SR1.6 మిలియన్ల జరిమానా విధించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







