తెలంగాణ లో నాల్గో రోజు కొనసాగుతున్న రాహుల్ యాత్ర

- October 29, 2022 , by Maagulf
తెలంగాణ లో నాల్గో రోజు కొనసాగుతున్న రాహుల్ యాత్ర

తెలంగాణ: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో నాల్గో రోజు కొనసాగుతుంది. శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి రాహుల్ తన పాదయాత్ర మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో హీరోయిన్ పూనమ్ కౌర్ జాయిన్ అయ్యారు. మహబూబ్ నగర్ టౌన్ నుంచి జడ్చర్లలోని రాజాపూర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.

ఈ రోజు మొత్తం 20.3 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేయనున్నారు. రాహుల్‌ వెంట CLP లీడర్‌ భట్టి విక్రమార్క, పలువురు నేతలు నడుస్తున్నారు. సాయంత్రం TPCC చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్రలో జాయిన్‌ కానున్నారు. రాత్రి 7 గంటలకు జడ్చర్లలో పాదయాత్రను ముగియనుంది. గొల్లపల్లిలోని శ్రీ సద్గురు మహర్షి మలయాల స్వామి లలితాంబిక తపోవనంలో బస చేయనున్నారు. ఈ యాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై రాహుల్ గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని.. పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com