నకిలీ వీసాపై కెనడాకు.. వ్యక్తికి జైలుశిక్ష
- October 30, 2022
దుబాయ్: నకిలీ వీసా ద్వారా కెనడాకు వెళ్లేందుకు ప్రయత్నించినందుకు ఒక ఆసియా వ్యక్తికి దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఒక నెల జైలు శిక్ష విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత సెప్టెంబర్‌లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారి కెనడాకు వెళ్లాలని భావించిన ఆసియన్ పాస్‌పోర్ట్‌లో నకిలీ వీసా స్టాంప్‌ను గుర్తించింది. వీసా నకిలీదని నిర్ధారించిన తర్వాత సదరు ప్రయాణికుపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ అధికారులకు కేసును బదిలీ చేశారు. నిందితుడు పొరుగు దేశంలోని టూరిజం కార్యాలయం నుండి 10,000 దిర్హామ్‌లకు కెనడాకు వెళ్లడానికి వీసా పొందాడని, అది నకిలీదని తనకు తెలియదని విచారణలో సదరు వ్యక్తి చెప్పాడు. కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్షను విధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







