అట్టహాసంగా ప్రారంభమైన సౌదీ గేమ్స్ 2022
- October 30, 2022
రియాద్: సౌదీ గేమ్స్ 2022 మొదటి ఎడిషన్ రియాద్‌లోని కింగ్ ఫహద్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6000 మందికి పైగా అథ్లెట్లు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. రియాద్ రీజియన్ గవర్నర్, హెచ్‌ఆర్‌హెచ్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ అతిథులకు స్వాగతం పలికారు. సౌదీ ఒలింపిక్, పారాలింపిక్ కమిటీ జెండాలను ప్రదర్శించారు. 2022లో ఆసియా టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి సౌదీ క్రీడాకారిణి డౌనియా అబౌటలేబ్, టోక్యో 2020 పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్న సౌదీ పారాలింపిక్ రైడర్ అహ్మద్ షర్బత్లీలు సౌదీ టీములకు ప్రాతినిధ్యం వహించారు. సౌదీ క్రీడల మంత్రి, సౌదీ ఒలింపిక్ మరియు పారాలింపిక్ కమిటీ ఛైర్మన్, ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. "లవ్ టునైట్", "టైటానియం" వంటి గీతాలను ప్రఖ్యాత ఫ్రెంచ్ DJ డేవిడ్ ఆలపించారు. నవంబర్ 7న గేమ్స్ ముగియనున్నాయి. ఇందులో పాల్గొనే అథ్లెట్లకు SR200 మిలియన్ విలువైన బహుమతులను అందజేయనున్నారు. గోల్డ్-మెడల్ విజేతలు SR1 మిలియన్లు, వెండి-కాంస్య పతక విజేతలు వరుసగా SR300,000, SR100,000 ప్రదానం చేస్తారు.
తాజా వార్తలు
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్‌లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు







