గల్ఫ్ అతిపెద్ద వింటేజ్ కార్ల ప్రదర్శన ప్రారంభం
- October 30, 2022
కువైట్: 2022-2023 సీజన్‌లో అతిపెద్ద వింటేజ్ కార్ల ప్రదర్శనను మెరీనా క్రెసెంట్‌లోని జీసీసీలో మాజీ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్-ఘానెమ్, అనేక ప్రైవేట్ కంపెనీల స్పాన్సర్‌షిప్‌తో Q8 ఓల్డ్ కార్స్ టీమ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోఅనేక మంది గల్ఫ్, కువైట్ వింటేజ్ కార్ల ఔత్సాహికుల పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్నవారు 70 సంవత్సరాల క్రితం తయారు చేసిన తమ వింటేజ్ కార్లను ప్రదర్శించారు. కువైట్ సొసైటీ ఫర్ ది కేర్ ఆఫ్ కేన్సర్ పేషెంట్స్ భాగస్వామ్యం ద్వారా క్యాన్సర్ రోగులకు ఈ ప్రదర్శన ద్వారా సహాయాన్ని అందించింది. ఈ వింటేజ్ కార్ల ఎగ్జిబిషన్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. ఇందులో ప్రదర్శించిన బాట్‌మాన్, మిస్టర్ బీన్, ఇతర ప్రముఖ చలనచిత్ర చిత్రాల్లోని వింటేజ్ కార్లు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఘనేమ్ ప్రతినిధి బాదర్ అల్-సిజారీ మాట్లాడుతూ.. ఆటోస్పోర్ట్‌లు, కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కువైట్‌కు ప్రాతినిధ్యం వహించే అన్ని కార్యకలాపాలు యువత అభిరుచులను హైలైట్ చేయడంతో పాటు ఈ ఈవెంట్‌లకు ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ వింటేజ్ కార్ల ప్రదర్శన ప్రస్తుతం 400 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని Q8 ఓల్డ్ కార్స్ టీమ్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ బాడర్ అల్-ఒటైబి తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







