దోపిడీలు, చైన్ స్నాచింగ్ కేసులో మహిళకు 3 ఏళ్ల జైలుశిక్ష
- October 30, 2022
బహ్రెయిన్ : దోపిడీలకు పాల్పడిన 32 ఏళ్ల మహిళకు పడ్డ మూడేళ్ల జైలు శిక్షను బహ్రెయిన్ కాసేషన్ కోర్టు ఖరారు చేసింది. అంతకుముందు తీర్పుకు వ్యతిరేఖంగా నిందితురాలు దాఖలుచేసిన అప్పీల్‌ను కొర్టు తిరస్కరించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఆసియన్ జాతీయుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అరబ్ జాతీయురాలైన మహిళను అరెస్ట్ చేశారు. మనమా, ముహరఖ్లలో నమోదైన పలు దొంగతనాలలో ఆ మహిళ ప్రమేయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు ఛార్జ్ షీట్లు స్పష్టం చేశాయి. ఆమె చాలా మంది వ్యక్తులను మోసం చేయడంతోపాటు రెండు గవర్నరేట్లలోని అనేక దుకాణాలలో దొంగతనం చేసిందని పోలీసులు నిర్ధారించారు. 2021 అక్టోబరు 15లో బాధితురాలు తొలిసారి బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆ మహిళను రాజ్యం నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







