వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
- October 30, 2022
సింగపూర్: సింగపూర్లోని ఆర్యవైశ్యులందరు భక్తిశ్రద్దలతో సింగపూర్ కు దగ్గరలో ఉన్నకూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తికవనభోజనాలను నిర్వహించారు, అందరు అనుకొన్న ప్రకారం ఉదయమే వారి వారి ఇంటినుండి తయారు చేసుకొన్న ఒక్కొక్క వంటకాన్ని తీసుకొని సామూహికంగా సముద్ర నౌక విహారం చేసి కుసు ద్వీపాన్ని చేరుకొన్నారు, మొదటగా సముద్రమునుండి సేకరించిన ఇసుకతో విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య కుటుంభం, అంజలి, చైతన్య గార్లు కలిసి ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేసారు, తరువాత సభ్యులందరు సామూహిక లింగాష్టకంలో పాల్గొన్నారు, పిదప శ్రీ మారియమ్మన్ ఆలయం నుండి తెచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక ప్రార్థనలు చేసారు. కార్యక్రమ ఆరంభ ప్రసంగాన్ని క్లబ్ సెక్రటరీ నరేంద్రకుమార్ నారంశెట్టి ప్రసంగిస్తూ కార్తీకమాస వైభవాన్ని, మరియు కార్తీకమాస ప్రాముఖ్యతను మరియు శివుని యొక్క రూపాలు మరియు విశిష్టతను సభ్యులకు వివరించారు, అందరూ కలిసి సామూహిక కార్తీక దీప సమర్పణ చేసారు.
తరువాత కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్ నాట్య ప్రదర్శన అందరిని ఆకట్టుకొంది. పిదప అమృత వాణి మరియు మానస నృత్య ప్రదర్శన జరిగింది. భోజన కమిటీని సమన్వయము చేసుకుంటూ నడిపించిన సభ్యుల్లో ముఖ్యంగా వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి లు 80 కి పైగా కుటుంబాలతో 250 మంది సభ్యులని సమన్వయంచేసుకొంటూ షడ్రసోపేతమైన విందుభోజనాలు సభ్యులందరికి అందించారు. అనంతరం ఫ్లాష్ మాబ్ మరియు విగ్నేశ్వర్ రావ్ మరియు మానస గారి సహకారంతో ఫ్యాషన్ వాక్ కార్యక్రమం అందరిని ఆనందింపచేసింది. శశిధర్, విశ్వేశ్వర్, దత్త గారి సహాయంతో సభాప్రాంగణాన్ని అలంకరించినపిమ్మట పిల్లలకి, మహిళలకి ప్రత్యేక ఆట పాటల కార్యక్రమం మరియు యాదా నరేష్ మరియు శ్రావణి ఆధ్వర్యంలో సాగిన ప్రత్యేక అభినయ విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హాజరైన క్లబ్ సహా వ్యవస్థాపకుడు మంచికంటి శ్రీధర్ గారు మాట్లాడుతూ కమిటీ గత పది సంవత్సరాల్లో ఎంతో వైభవాన్ని సంతరించుకొన్నదని కొనియాడారు, మరికొంత మంది సీనియర్ సభ్యులైన విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్ బచ్చు, దివ్య గాజులపల్లి, గోపి కిషోర్, సతీష్ కోట మొదలగు వ్యక్తులు వారి విలువైన అనుభూతులను మరియు క్లబ్ కార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ వుద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ, పల్లపోతుల కిషోర్ , నందన్, మానస్ తదితరులు వారి వారి సహకారాన్నిచ్చి ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా కౌ అండ్ ఫార్మర్, సంపూర్ణ స్వదేశీ, సౌజి డేకర్స్, కామాక్షి జువెల్లర్స్, జి ఆర్ టి జువెల్లర్స్ సహకరించారు.
చివరిగా కార్యక్రం ముగింపు సభలో కిషోర్ శెట్టి పోషించిన కీలక పాత్రను క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మరియు సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కాకిషోర్ అభినందించారు గత తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర సేవలను గుర్తిస్తూ సీనియర్ సభ్యులందరు దంపతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. నరేంద్ర మాట్లాడుతూ సింగపూర్ లో కోవిడ్ పరిస్థితుల తరువాత మల్లి మూడు సంవత్సరాల తరువాత 250 మంది సభ్యులతో కూడిన కార్యక్రమం కుసు ద్వీపంలో జరగడం ఎంతో ఆనందించదగ్గ విషయమని, వైశ్యులు అన్ని ధార్మిక, సేవ కార్యక్రమాల్లో ఎప్పటిలాగే ముందుండి ఇకమీదట కూడా నడిపించాలని తెమిలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.


తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్‌లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్‌తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









