షార్జా టాక్సీలో 65% పెరిగిన హైబ్రిడ్ వాహనాలు
- October 30, 2022
షార్జా: ఇంధనం, విద్యుత్ రెండింటిలోనూ పనిచేసే హైబ్రిడ్ వెహికల్ ఫ్లీట్ కార్ల సంఖ్యను పెంచాలని షార్జా టాక్సీ, షార్జా ప్రభుత్వ పెట్టుబడి విభాగం, షార్జా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుబంధ సంస్థలు నిర్ణయించాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో షార్జా టాక్సీ తన వాహన సముదాయంలో 65% వరకు హైబ్రిడ్ వాహనాలను చేర్చింది. దీంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించినట్లు షార్జా టాక్సీ పేర్కొంది. కంపెనీ మొత్తం కార్ల సముదాయంలో 100% హైబ్రిడ్ వాహనాలను చేర్చేడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్జా టాక్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, షార్జా సిటీలో పనిచేస్తున్న షార్జా టాక్సీ ఫ్లీట్‌లో 60% ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







