3 రోజుల కువైట్‌ ఆయిల్‌ యూనియన్‌ స్ట్రైక్‌ ముగింపు

- April 21, 2016 , by Maagulf
3 రోజుల కువైట్‌ ఆయిల్‌ యూనియన్‌ స్ట్రైక్‌ ముగింపు


కువైట్‌ ఆయిల్‌ యూనియన్‌ మూడు రోజులపాటు జరిపిన స్ట్రైక్‌ని ముగించాయి. చమురు కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చేలా ఎమిర్‌ షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సభా నుంచి తగిన హామీ వచ్చినట్లు ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి. కువైట్‌ ఆయిల్‌ కంపెనీ వర్కర్స్‌ యూనియన్‌ అధికార ప్రతినిథి అదెల్‌ అల్‌ ఫాదెల్‌ మాట్లాడుతూ, వర్కర్స్‌ బుధవారం నుంచి తమ విధులకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తమ సమ్మె విజయవంతమయ్యిందని ఆయన చెప్పారు. కార్మికుల హక్కుల్ని పరిరక్షిస్తామని ఎమిర్‌ షేక్‌ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, మూడు రోజుల సమ్మెతో కువైట్‌ ఆయిల్‌ ప్రొడక్షన్‌పై తీవ్ర ప్రభావమే పడింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com