ఖతార్ యూనివర్సిటీ స్టడీ ఫెయిర్ విజయవంతం
- April 21, 2016
ఖతార్ యూనివర్సిటీ (క్యూయూ) ఆరవ స్టడీ అబ్రాడ్ ఫెయిర్ విజయవంతమయ్యింది. సోమవారం జరిగిన ఈ ఫెయిర్‌లో 22 అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అలాగే, వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిథులు పాల్గొన్నారు. ఖతార్ స్టూడెంట్స్‌కి వివిధ దేశాల్లో ఉన్న అవకాశాల్ని తెలుసుకోడానికి ఈ వేదిక ఉపయోగపడుతంది. యూనివర్సిటీకి చెందిన స్కాలర్‌షిప్స్ మరియు పార్టనర్‌షిప్స్ ఆఫీస్ నిర్వహించిన ఈ ఈవెంట్ ఖతార్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ హస్సన్ రషీద్ అల్ దెర్హామ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్‌కి చెందిన ఎంబసీ ప్రతినిథులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సుమారు 600 మందికి పైగా స్టూడెంట్స్ ఈ ఈవెంట్ ద్వారా తగిన సమాచారాన్ని తెలుసుకోగలిగారు. వివిధ దేశాలు అందించే విద్య, దాంతోపాటుగా స్కాలర్‌షిప్స్ గురించి విద్యార్థులు తెలుసుకుని, తమ భవిష్యత్తు గురించిన మంచి అవగాహనతో ఆయా దేశాలకు వెళ్ళి చదువుకోడానికి వీలుగా ఈ ఈవెంట్ జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







