మహిళ ద్వారా అవమానపడ్డ వ్యక్తికి 23,000 దిర్హామ్‌ల పరిహారం
- November 04, 2022
అబుధాబి: వాట్సాప్ ద్వారా ఓ వ్యక్తికి అభ్యంతరకరమైన సందేశాలు పంపిన మహిళకు అబుదాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్ట్ మెట్టికాయలు వేసింది. నష్టపరిహారంగా సదరు వ్యక్తికి 23,000 దిర్హామ్‌లు చెల్లించాలని ఆదేశించింది. మహిళ నుండి వచ్చిన సందేశాల కారణంగా అనుభవించిన నైతిక, భౌతిక నష్టాలకు పరిహారంగా Dh600,000 చెల్లించాలని ఆ వ్యక్తి మహిళపై దావా వేశారు. వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఆ మహిళ తనను అవమానించిందని, అది తనను మానసికంగా ప్రభావితం చేసిందని ఆ వ్యక్తి తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. అవమానకరమైన సందేశాలు సమాజంలో తన ప్రతిష్టను కూడా దెబ్బతీశాయన్నారు. వ్యక్తిని అవమానించినందుకు, ఆన్‌లైన్ చట్టాలను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత ఆ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 5,000 దిర్హామ్‌లు జరిమానా విధించింది. తీర్పును జారీ చేసిన తర్వాత సదరు వ్యక్తి పరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







