ఫిఫా ప్రపంచ కప్: 24 గంటలు హెల్త్‌కేర్ హెల్ప్‌లైన్ సేవలు

- November 04, 2022 , by Maagulf
ఫిఫా ప్రపంచ కప్: 24 గంటలు హెల్త్‌కేర్ హెల్ప్‌లైన్ సేవలు

దోహా: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా ప్రపంచ దేశాల నుండి వచ్చే ఫుట్ బాల్ అభిమానుల కోసం ప్రభుతవ హెల్త్‌కేర్ హెల్ప్‌లైన్ సేవలను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నట్లు హమద్ మెడికల్ కార్పొరేషన్ ప్రకటించింది. దేశంలోని ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, క్లినిక్‌లు, ఫార్మసీలలో వైద్య సంరక్షణను పొందడం గురించిన సమాచారం కోసం అభిమానులు 16000కి కాల్ చేయాలని సూచించింది. అరబిక్, ఇంగ్లీషు రెండింటిలోనూ పనిచేసే 16000 హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. హయ్యా హాట్‌లైన్ (800 2022)కి కాల్ చేసేవారు వారి ప్రశ్న ఆరోగ్య సంరక్షణకు సంబంధించినదైతే 16000 హెల్ప్‌లైన్‌కి కూడా బదిలీ చేయవచ్చని పేర్కొంది. హయ్యా హాట్‌లైన్ అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్, హిందీ, పోర్చుగీస్, మాండరిన్‌తో సహా పలు భాషలలో సేవలు అందిస్తుందని క్వాలిటీ డిప్యూటీ చీఫ్, డిప్యూటీ చీఫ్ క్వాలిటీ ఆఫీసర్, హమద్ హెల్త్‌కేర్ క్వాలిటీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, 16000 హెల్త్ సెక్టార్ కాల్ సెంటర్ హెడ్ నాజర్ అల్ నైమి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com