ఈ నెల 7న రాహుల్ గాంధీ యాత్ర వీడ్కోలు సభ: రేవంత్
- November 04, 2022
హైదరాబాద్: రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈరోజు రాహుల్ తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ నెల 07 తో రాహుల్ యాత్ర తెలంగాణాలో పూర్తి అవుతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర లో యాత్ర కొనసాగించబోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల భారీ వీడ్కోలు సభ ఏర్పాటు చేయబోతుంది టీ కాంగ్రెస్. దీనికి సంబదించిన విషయాలను మీడియా తో పంచుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన కార్యాచరణపై వారు చర్చించారు.
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించినా.. దాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేశారని రేవంత్ తెలిపారు. ఈ నెల 5,6 తేదీల్లో మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందని, 7న భారీ బహిరంగ సభతో వీడ్కోలు సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలకు పాదయాత్రలో పాల్గొనే అవకాశం రానందున వారంతా ఈ మూడు రోజులు క్రియాశీల పాత్ర పోషించాలని తెలిపారు. 7వ తేదీ రాత్రి దెగ్లూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెడుతుందని రేవంత్ తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







