టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్..
- November 05, 2022
ఆస్ట్రేలియా: టీ20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరింది. సూపర్-12 దశలోనే ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ ఏడు పాయింట్లు సాధించింది. అయితే, ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ రన్‌రేట్ ఎక్కువగా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇప్పటికే సెమీస్ చేరిన న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఇక గ్రూప్-2 నుంచి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో ప్రతి జట్టు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, వీటిలో నెదర్లాండ్స్ ఇప్పటికే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కూడా అవకాశం లేదు. అయితే, పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉంది. అదీ అద్భుతాలు జరిగితేనే.
ఇండియా, సౌతాఫ్రికా జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ఇటు ఇండియా, అటు సౌతాఫ్రికా ఈజీగా విజయం సాధిస్తాయి. దీంతో ఈ రెండు జట్లే సెమీస్‌కు వెళ్తాయి. ఒకవేళ ఈ రెండు జట్లలో ఏదైనా జట్టు ఓడిపోతే సమీకరణాలు మారిపోవచ్చు. అప్పుడు అనూహ్యంగా పాక్ కూడా రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇందుకు అవకాశం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే పాక్ సెమీస్ చేరాలంటే జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోవడమో లేక నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడి పోవడమే జరగాలి. అలాగే బంగ్లాదేశ్‌పై పాక్ భారీ తేడాతో విజయం సాధించాలి. ఈ మూడింట్లో ఏది జరగకపోయినా పాక్‌కు ఛాన్స్ లేదు. దీంతో ఇండియా, సౌతాఫ్రికా జట్లకే సెమీస్ చేరే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







