ట్రక్కు దొంగతనం.. ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా
- November 05, 2022
దుబాయ్: ఒక ట్రక్కును దొంగిలించి, దానిలోని రాగి లోడును విక్రయించిన ఇద్దరు వ్యక్తులకు దుబాయ్ మిస్‌డిమినర్ కోర్టు జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఒక ఆసియా డ్రైవర్ తను పనిచేస్తున్న కంపెనీకి చెందిన ట్రక్కును, అందులోని రాగి కేబుల్స్ ని దొంగిలించి.. ఇతరులకు అమ్మాడు. గత ఆగస్టులో షార్జాలో ఈ కేసు నమోదైంది. సదరు కంపెనీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన డిటెక్టివ్‌ల బృందం.. ట్రక్కును, అందులోని రాగి కేబుల్స్ ఉన్న ప్రాంతాన్ని కొనుగొన్నది. అనంతరం గుర్తు తెలియన వారి నుంచి ట్రక్కును కొన్న వ్యక్తిని గుర్తించి ట్రక్కను స్వాధీనం చేసుకున్నారు. అతడు అందజేసిన సమాచారంతో ట్రక్కును అమ్మిన డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారించిన కోర్టు.. ట్రక్కను అమ్మిన ఆసియా డ్రైవర్ కు పాటు ఒక సంవత్సరం జైలు శిక్ష, విధుల దుర్వినియోగానికి Dhs80,000 జరిమానా విధించింది. అలాగే గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ట్రక్కున కొన్న మరో వ్యక్తికి నెలరోజుల జైలుశిక్ష విధించింది. ఇద్దరు నిందితులు కలిసి ట్రక్కు ఓనరుకు Dhs1.5 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. శిక్ష పూర్తయిన తర్వాత ఇద్దరిని దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







