విజయ్ వారసుడు నుండి 'రంజితమే' సాంగ్ విడుదల
- November 05, 2022
చెన్నై: విజయ్ నటిస్తున్న వారసుడు మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రంజితమే రిలీజ్ అయ్యింది. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుండి ” రంజితమే” అనే పాటని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్ లో విజయ్ తలపతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టాడని చెప్పొచ్చు.
ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగి బాబు, సంగీత తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా ఫస్ట్ టైమ్ రష్మిక అలరించనుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘బీస్ట్’ తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







