పోప్ ఫ్రాన్సిస్‌ను అతని నివాసంలో కలిసిన కింగ్ హమద్

- November 06, 2022 , by Maagulf
పోప్ ఫ్రాన్సిస్‌ను అతని నివాసంలో కలిసిన కింగ్ హమద్

మనామా: హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్‌ను అతని నివాసంలో హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మర్యాద పూర్వకంగా కలిశారు. కింగ్ హమద్ వెంట ఆయన వ్యక్తిగత ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా, కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, వాటికన్ మధ్య బలమైన సంబంధాలు, అన్ని స్థాయిలలో స్థిరమైన వృద్ధి తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బహ్రెయిన్ లో పోప్ చారిత్రాత్మక పర్యటన సదర్భంగా నేషనల్ స్టేడియంలో నిర్వహించిన హోలీ మాస్ కు బహ్రెయిన్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల నుండి వేలాది మంది హాజరయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com