సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్..
- November 07, 2022
ఆస్ట్రేలియా: టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు నాలుగు జట్లు చేరుకున్నాయి. గ్రూప్-1 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధించాయి. ఈనెల 9న న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండగా, 10న ఆడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఢీకొట్టనుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు ఇంతకు ముందుకూడా ఇంగ్లండ్‌తో తలపడింది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. ఇంగ్లండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది.మూడు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై భారత్ రెండుసార్లు విజయం సాధించగా, ఇంగ్లండ్ ఒక్కసారి విజయం సాధించింది.2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. చిరస్మరణీయమైన, చారిత్రాత్మకమైన ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
2009లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్-భారత్ మధ్య రెండోసారి మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
2012లో ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య మూడోసారి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 90 పరుగుల తేడాతో టీమిండియాపై భారీ విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌లో తలపడడం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారికూడా ఇరు జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్ జరగలేదు.
భారత్, ఇంగ్లండ్ జట్లు టీ20 ప్రపంచ కప్‌తో కలిపి మొత్తం 22 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వీటిల్లో 12 విజయాలతో భారత్‌దే పైచేయిగా ఉంది.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







