నకిలీ నోట్ల ముద్రణ కేసులో ఆరుగురి అరెస్ట్
- November 08, 2022
జెడ్డా: నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో ఇద్దరు పౌరులతో సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. ఈ ముఠా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. విచారణ కోసం కోర్టుకు వారిని రిఫర్ చేయనున్నట్లు తెలిపింది. నోట్లను ముద్రించేందుకు నిందితులు ఎలక్ట్రానిక్ మెషిన్‌లను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైందని వివరించింది. నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో శిక్షా విధానంలోని ఆర్టికల్ టూ ప్రకారం.. నేరస్థులకు 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట కొండపైకి రోప్ వే
- ఏపీకి కొత్త అసెంబ్లీ భవనం
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..