పర్వతారోహణలో గాయపడిన మహిళను రక్షించిన రెస్క్యూ బృందాలు
- November 08, 2022
మస్కట్: అల్ హమ్రాలోని విలాయత్‌లో పర్వతారోహణలో గాయపడిన మహిళను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) రెస్క్యూ బృందాలు రక్షించాయి. అనంతరం అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రికి తరలించాయి. ఈ మేరకు సీడీఏఏ వెల్లడించింది. అల్ హమ్రాలోని విలాయత్‌లో పర్వతారోహణ సమయంలో ఒక మహిళ గాయపడినట్లు వచ్చిన సమాచారంతో అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగంలోని రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాయని, ఆమెకు అత్యవసర వైద్య సంరక్షణ అందించి, అవసరమైన చికిత్సను అందించడానికి ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సీడీఏఏ తెలిపింది.
తాజా వార్తలు
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్‌పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!
- 1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!
- గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!
- వెస్టిండీస్ సిరీస్ కు టీం ఇండియా జట్టు ఇదే!