గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మోదీ
- November 08, 2022
న్యూ ఢిల్లీ: గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసాన్ని ప్రధాని సందర్శించారు. ప్రధాని మోదీ గురునానక్ దేవ్‌కు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు.. సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురునానక్ దేవ్ ఆలోచనల స్ఫూర్తితో దేశం 130 కోట్ల మంది భారతీయుల సంక్షేమ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. సిక్కుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. సిక్కుల కుటుంబీకులు ఉపాధికోసం, వ్యాపార కార్యకలాపాలకోసం పొరుగుదేశాలకెళ్లి అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. పొరుగుదేశాల్లో ఇబ్బందులుపడుతున్నవారు భారతదేశం తిరిగొస్తే భారతీయ పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు, మంగళవారం సాయంత్రం 8 గంటలకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్ 95లో శ్రీ గురునానక్ దేవ్ జీ 553వ జయంతి వేడుకలు జరుగుతాయని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని, సిక్కు మత ప్రబోధకుడు గురునానక్‌కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని ప్రకటించింది. అనంతరం సిక్కులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని పీఎంవో ప్రకటించింది.
ఇక, కార్తీక మాసంలో పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుపుకుంటారు. సిక్కుల మొదటి గురువు గురునానక్ సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి.. కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు.ఈ జయంతిని ప్రకాశ పర్వం, గురుపర్బ్ అని కూడా అంటారు. ఈరోజున సిక్కులు తమ మత గ్రంథం.. గురు గ్రంథ్ సాహిబ్‌ను నిరంతరం పారాయణం చేస్తారు.

తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్‌పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









